Alishan Sharafu : అంతర్జాతీయ క్రికెట్లో భారత మూలాలున్న ఆటగాళ్లు చాలామందే. ప్రస్తుతం పలు దేశాల జట్లలోని కనీసం ఒకరో ఇద్దరి ఆటగాళ్ల పూర్వీకులు భారతీయులే అనేది నిజం. తేజ నిడమనూరు, విక్రమ్‌జిత్ సింగ్ (నెదర్లాండ్స్) రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్(న్యూజిలాండ్), మాంటీ పనేసర్( ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్), సౌరభ్ నేత్రావల్కర్(యూఎస్ఏ), కేశవ్ మహరాజ్, సెనురన్ ముతుస్వామి (దక్షిణాఫ్రికా), దిల్‌ప్రీత్ బజ్వా (కెనడా)లు అందుకు ఉదాహరణ. ఈ జాబితాలో యూఏఈ ఓపెనర్ అలీషాన్ షరాఫు (Alishan Sharafu) కూడా ఒకడు. అవును.. ఇతడు పుట్టింది కేరళలో. ఇంతకూ షరాఫు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి స్ఫూర్తి ఎవరు.. అతడి ప్లాన్ బీ ఎంటీ.. అనేవి చదవేద్దామా.
షరాఫు తల్లిదండ్రులది కేరళలోని తిరువనంతపురం. 2003లోజన్మించిన అతడు చిన్నవయసులోనే యూఏఈకు వలస వెళ్లారు. దాంతో.. షరాఫు అక్కడే పెరిగాడు. క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్న అతడు 15 ఏళ్లకు అండర్ -19 జట్టుకు ఎంపికయ్యాడు. రెండేళ్ల తర్వాత టీ20ల్లో, ఆ మరుసటి ఏడాది వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి జట్టులో కొనసాగుతూ అనతికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు షరాఫు. ఇంటర్నేషనల్ టీ20లో అబుదాబీ నైట్ రైడర్స్ తరఫున ఆడడం అతడి ఆట స్వరూపాన్నే మార్చేసింది.
Alishan Sharafu had Oman’s bowlers on the ropes⚡
Watch #UAEvOMAN, LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/FcTMmT0K2q
— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2025
ఆ జట్టు విధ్వంసక ఆల్‌రౌండర్లు ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాడు షరాఫు. ఆ ఇద్దరిని గమనిస్తూ.. క్రమంగా వాళ్లలా ధనాధన్ ఆడడం, ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో రాటుదేలిన ఈ డాషింగ్ బ్యాటర్.. ఇటీవల యూఏఈ సీనియర్ జట్టు తరఫున కెప్టెన్ ముహమ్మద్ వసీంతో కలిసి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం ఆసియా కప్‌లో మెరుస్తున్న షరాఫు క్రికెటర్ అవ్వడానికి కారణం భారత వెటరన్ సచిన్ టెండూల్కర్. అవును.. ఈ విషయాన్ని స్వయంగా షరాఫు వెల్లడించాడు.
‘క్రికెట్‌కు సంబంధించిన తొలి జ్ఞాపకం అంటే 2011 వన్డే వరల్డ్ కప్. ఆ టోర్నీలో నేను భారత్‌కు మద్దతుగా నిలిచాను. ఎందుకంటే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆడుతున్న చివరి ప్రపంచ కప్ అది. ఈ టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ ఆట చూశాకే నేనూ క్రికెటర్ అవ్వాలనుకున్నా. సచిన్ స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్నాను’ అని షరాఫు వెల్లడించాడు.
Born in Kerala, raised in the UAE, inspired by Tendulkar and India’s 2011 World Cup win!
Meet UAE opener Alishan Sharafu: https://t.co/dRQOun7rCB pic.twitter.com/aC8zVJtSk4
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2025
అయితే.. ఒకవేళ క్రికెటర్‌గా ప్లాన్ బీగా ఉంటుందని సైబర్ సెక్యూరిటీ కోర్స్ కూడా చేశాడట. అయితే.. ఐఎల్ టీ20లో రాణించడం.. యూఏఈలో కీలక ప్లేయర్‌గా ఎదగడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సి రాలేదని అంటున్నాడు షరాఫు. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత్‌పై విఫలమైన అతడు.. ఒమన్‌పై మాత్రం దంచేశాడు. జట్టుకు శుభారంభం ఇస్తూ.. 51 పరుగులతో చెలరేగాడీ హిట్టర్.