FIFA World Cup: అమెరికాతో థ్రిల్లర్.. ఆఖరి నిమిషంలో నెగ్గిన టర్కీ
Fifa world cup: 2026 ఫిఫా వరల్డ్‌కప్‌లో టర్కీ తొలి విజయాన్ని నమోదు చేసింది. వాస్తవానికి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఆ జట్టు .. లాస్ ఏంజిల్స్ స్టేడియంలో హోస్ట్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 3-2 గోల్స్ తేడాతో నెగ్గింది.
లాస్ ఏంజిల్స్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో టర్కీ తొలి విజయాన్ని నమోదు చేసింది. వాస్తవానికి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఆ జట్టు .. లాస్ ఏంజిల్స్ స్టేడియంలో హోస్ట్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 3-2 గోల్స్ తేడాతో నెగ్గింది. గ్రూప్ డీ మ్యాచ్‌లో మొత్తం అయిదు గోల్స్ నమోదు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా.. ఆ గ్రూపులో మాత్రం ఆ దేశమే అగ్రస్థానంలో ఉన్నది. ఆట ప్రారంభమైన మూడు నిమిషాలకే అమెరికా ప్లేయర్ ఆస్టన్ ట్రస్టీ గోల్ కొట్టాడు. డీప్ కార్నర్ నుంచి సెబాస్టియన్ అందించిన పాస్‌ను లెఫ్ట్ ఫూట్‌తో ట్రస్టీ గోల్‌గా మలిచాడు.
టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినా.. అమెరికాతో మ్యాచ్‌లో మాత్రం టర్కీ పట్టుదలతో ఆడింది. ఇక టర్కీ ప్లేయర్ గులేర్ 10వ నిమిషంలో ఆ జట్టుకు తొలి గోల్ అందించాడు. అరగంట ఆట ముగిశాక.. టర్కీ ప్లేయర్ బారిస్ యిల్మాజ్ మరో గోల్ చేశౄడు. దీంతో టర్కీ లీడింగ్‌లోకి వెళ్లింది. రెండో హాఫ్ 49వ నిమిషంలో అమెరికా ప్లేయర్ బెర్హాల్టర్ గోల్ చేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపాడు. దాదాపు ఆట ముగిసే సమయం వరకు రెండు జట్లు 2-2 గోల్స్ తేడాతో సమంగా పోరాడాయి.
కానీ 98వ నిమిషంలో టర్కీ ప్లేయర్ అందర్నీ స్టన్ చేశాడు. కాన్ అయాన్ గోల్ చేయడంతో కీలకమైన మూడు పాయింట్లు టర్కీ ఖాతాలోకి వెళ్లాయి. అమెరికా జట్టు ఈ టోర్నీలో చరిత్ర సృష్టిస్తోంది. ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఈవెంట్లో ఇప్పటికే 8 గోల్స్ చేసింది. గతంలో 1930, 2002లో అత్యధికంగా ఏడు గోల్స్ మాత్రమే చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

