హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ అంతర జిల్లాల టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో వేదాంశ్ టైటిల్‌తో మెరిశాడు. బుధవారం జరిగిన బాలుర అండర్-11 ఫైనల్లో వేదాంశ్ 11-9, 11-9, 13-11 తేడాతో శ్రీనీర్రెడ్డిపై అద్భుత విజయం సాధించాడు. మరోవైపు మహమ్మద్ అలీ 11-6, 11-6, 11-7తో రాజును ఓడించి టైటిల్ దక్కించుకున్నాడు. మహిళల పోరులో శ్రేష్టారెడ్డి 11-6, 11-9, 11-9తో పాలక్‌పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.