సింగపూర్: సింగపూర్ ఓపెన్‌లో సంచలన విజయాలతో దుమ్మురేపిన భారత యువ ద్వయం గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీకి నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో గాయత్రి, త్రిసా జోడీ 21-23, 11-21తో జపాన్ జంట నమి మత్సుయమ, చిహారు శిదా చేతిలో ఓటమిపాలయ్యారు. గత రెండు మ్యాచ్‌ల్లో తమ కంటే మెరుగైన ర్యాంక్ ప్లేయర్లపై గెలిచిన అన్‌సీడెడ్ గాయత్రి, త్రిసా..అదే జోరును సెమీస్‌లో కొనసాగించలేకపోయారు. 47 నిమిషాల పాటు జరిగిన పోరులో ప్రపంచ నంబర్-4 జోడీకి దీటైన పోటీనిచ్చేందుకు ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. వీరి నిష్క్రమణతో టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది.