WTC Final 2023 : దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్(52 నాటౌట్) ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ బాదాడు. శార్ధూల్ ఠాకూర్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 61 బంతుల్లో 9 ఫోర్లతో అర్ధ శతకం సాధించాడు. స్టీవ్ స్మిత్(31)హెడ్ కలిసి ఆసీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్లు నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. 44 ఓవర్లకు ఆస్రేలియా స్కోర్.. 160/3.
A brilliant attacking innings from Travis Head 🔥
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/KwXitedrRY
— ICC (@ICC) June 7, 2023
లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే ఆస్రేలియాకు పెద్ద షాక్. క్రీజులో కుదురుకున్న మార్నస్ లబుషేన్(26)ను షమీ బౌల్డ్ చేశాడు. షీ వేసిన తొలి బంతిని డిఫెండ్ చేయాలనుకున్నాడు. కానీ, బంతి మిస్ అయి ఆఫ్ స్టంప్‌ను తాకింది. దాంతో, 76 రన్స్ వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్మిత్, హెడ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.