Iga Sviatech | లండన్: నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినందుకు గాను ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌పై ఒక నెల నిషేధం పడింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన డోప్ పరీక్షలో పోలండ్ భామ పాజిటివ్‌గా తేలింది. స్వియాటెక్ తన తప్పును ఒప్పుకోవడంతో ఆమెపై నామమాత్రపు శిక్షగా నెల రోజుల నిషేధాన్ని విధించినట్టు ఐటీఐఏ తెలిపింది.