మాంట్రీల్ : యూఎస్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న నేషనల్ బ్యాంక్ ఓపెన్ (కెనడా ఓపెన్)లో జపాన్ భామ నవొమి ఒసాకా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఒసాకా.. 6-2, 7-6 (9/7) 19వ సీడ్ క్లారా టాసన్ (డెన్మార్క్)ను చిత్తుచేసి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరింది.
టైటిల్ పోరులో ఒసాకా.. విక్టోరియా ఎంబొకొ (కెనడా)తో అమీతుమీ తేల్చుకోనుంది. కోకో గాఫ్, రిబాకినా వంటి స్టార్ ప్లేయర్లను ఓడించిన విక్టోరియా ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో బెన్ షెల్టన్ (అమెరికా), కరెన్ ఖచనోవ్ (రష్యా)తో తలపడనున్నాడు.