గువాహటి: గువాహటి మాస్టర్స్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు ప్రియాంశు రజావత్, తన్విశర్మ ప్రికార్వర్ట్స్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో ప్రియాంశు 22-20, 21-14తో ఆర్యపై విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్‌లో తన్విశర్మ 21-18, 21-14తో తాన్య హేమంత్పై గెలిచి ముందంజ వేసింది. శ్రియాంశి వలిశెట్టి 21-19, 21-14తో ఉన్నతి హుడాపై గెలిచింది.