పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్‌సీడ్ జానిక్ సిన్నర్ జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ సిన్నర్ 6-0, 6-1, 6-2తో జిరి లెహెకాపై అలవోక విజయం సాధించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో తన వరుస విజయాల సంఖ్యను 17కు పెంచుకున్నాడు. గంటా 34 నిమిషాల్లో ముగిసిన పోరులో సిన్నర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.