Tom Bruce : జాతీయ జట్టుకు ఎంపికవ్వడమే గగనం అయిన ఈ రోజుల్లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు కొందరున్నారు. ఈ జాబితాలో త్వరలోనే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు టామ్ బ్రూస్ (Tom Bruce) చేరనున్నాడు. వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌ల నుంచి స్కాట్లాండ్ జెర్సీతో ఆడేందుకు సిద్ధమవుతున్నానని మంగళవారం బ్రూస్ ప్రకటించాడు. తన తండ్రి పుట్టి పెరిగిన దేశానికి ప్రాleaతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని బ్రూస్ వెల్లడించాడు.
‘మా కుటుంబానికి స్కాట్లాండ్ వారసత్వ చరిత్ర ఉంది. విశ్వ వేదికపై స్కాట్లాండ్కు ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఐదేళ్లు న్యూజిలాండ్‌కు ఆడే అవకాశం దక్కడం నా అదృష్టం. జట్టు మారినా నా ఆటలో దూకుడు తగ్గకుండా చూసుకుంటా. ఇంతకుముందులానే చెలరేగుతూ స్కాట్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నా’ అని పేర్కొన్నాడీ 34 ఏళ్ల క్రికెటర్.
Tom Bruce, who played 17 T20Is for New Zealand between 2017 and 2020, has shifted his loyalties to Scotland and could make his ODI debut for his new side later this month 🏴
Full story: https://t.co/MY3TaTHQTf pic.twitter.com/tY4ony4NEO
— ESPNcricinfo (@ESPNcricinfo) August 12, 2025
ఇంతకూ టామ్ బ్రూస్‌కు స్కాట్లాండ్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే.. అతడి తండ్రి స్టీఫెన్ బ్రూస్ ఎడిన్బర్గ్లో జన్మించాడు. 2016లో న్యూజిలాండ్‌కు వలస వెళ్లేంత వరకూ ఆయన స్కాట్లాండ్ డెవలప్మెంట్ పనుల్లో చురుగ్గా పనిచేశాడు కూడా. అందుకే.. బ్రూస్‌కు తమ దేశం తరఫున ఆడేందుకు స్కాట్లాండ్ సెలెక్టర్లు అనుమతించారు. టాపార్డర్ బ్యాటర్ అయిన బ్రూస్ 2017లో కివీస్ క్రికెటర్‌గా అరంగేట్రం చేశాడు. మూడేళ్లు జట్టుతో కొనసాగిన అతడు 17 టీ20లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత గయానాలో గ్లోబల్ సూపర్ లీగ్‌లో తళుక్కుమన్నాడీ హిట్టర్. ఆగస్టు 27 నుంచి కెనడా వేదికగా వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆలోపే బ్రూస్ స్కాట్లాండ్ టీమ్‌తో చేరునున్నాడు.