ISPL T10 | బుధవారం నుంచి థానే (మహారాష్ట్ర) వేదికగా మొదలైన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) లో నిర్వాహకులు కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టారు. క్రికెట్లో అంతర్జాతీయవ్యాప్తంగా చాలాకాలంగా టాస్ వేయడం అంటే ఇరు జట్ల సారథులు, మ్యాచ్ నిర్వాహకులు పిచ్ దగ్గరకు వచ్చి కాయిన్‌ను విసరడం.. అందులో ఎవరు నెగ్గితే వాళ్లదే టాస్ గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ ఐఎస్పీఎల్లో మాత్రం కాయిన్ లేకుండానే విచిత్రంగా టాస్‌ను నిర్వహిస్తున్నారు. అదెలా అంటే…
కొత్త విధానంలో టాస్ వేసేందుకు గాను ఇరు జట్ల సారథులు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నిలబడతారు. మ్యాచ్ రిఫరీ రెడీ అనగానే వాళ్లు అక్కడ్నుంచి నేరుగా ఆరు అడుగుల దూరం ముందుకు నడుస్తారు. ఆ తర్వాత అక్కడే ఆగి మళ్లీ రిటర్న్ తిరిగి.. ఒక్కో అడుగును జత కలుపుతూ ముందుకు వస్తారు. ఇలా వచ్చే క్రమంలో ఎవరైతే ముందుగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కాలిని తొక్కితే అతడు టాస్ గెలిచినట్టుగా నిర్ణయిస్తారు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో భాగంగా బుధవారం సచిన్ టెండూల్కర్ – అక్షయ్ కుమార్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు స్టార్లు టాస్ కోసం ఇలాగే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని టిప్ టాప్ టాస్ అని పిలుస్తున్నారు.
𝐀 𝐔𝐍𝐈𝐐𝐔𝐄 𝐓𝐎𝐒𝐒 𝐑𝐎𝐔𝐓𝐈𝐍𝐄 to flag off the exhibition clash in #ISPLT10 👀
Superstars Akshay Kumar & Sachin Tendulkar use the street style 𝗧𝗜𝗣-𝗧𝗢𝗣 toss method to determine who bats/bowls first 😅❤️#Street2Stadium #SonyLIV pic.twitter.com/Pi75UoDlXQ
— Sony LIV (@SonyLIV) March 6, 2024
Tip top toss in ISPL#ISPL pic.twitter.com/aOV5PPKpVV
— Harish Jangid (@HarishJ56732474) March 6, 2024