IPL 2026 : ఐపీఎల్ వేలానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తమ కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసుకుంటోంది. ఇటీవలే అభిషేక్ నాయర్‌ను హెడ్‌కోచ్‌గా.. ఆస్ట్రేలియా వెటరన్ షేన్ వాట్సన్(Shane Watson)ను అసిస్టెంట్ కోచ్‌గా తీసుకుంది కోల్‌కతా. బౌలింగ్ యూనిట్‌ను పటిష్టం చేయడం కోసం అనుభవజ్ఞుడైన మాజీ పేసర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్ సౌథీ(Tim Southee)ని బౌలింగ్ కోచ్‌గా కోల్‌కతా ఎంచుకుంది. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
పద్దెనిమిదో సీజన్లో ఘోరంగా విఫలమైన కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి పుంజుకోవాలనే కసితో ఉంది. అందుకు బెంచ్ స్ట్రెంత్తో పాటు కోచింగ్ యూనిట్ కూడా బలంగా ఉండాలని భావించిన యాజమాన్యం కీలక నియామకాలు చేపట్టింది. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవమున్న టిమ్ సౌథీని బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అతడు గతంలో ఈ ఫ్రాంచైజీకి ప్రధాన పేసర్‌గా ఆడడం కూడా కలిసొచ్చిందని చెప్పచ్చు.
Back in the pack to shape our bowling attack 🔥🫡
[@VenkyMysore , AmiKKR, TATA IPL, Bowling coach] pic.twitter.com/sLorGgrcX9
— KolkataKnightRiders (@KKRiders) November 14, 2025
‘టిమ్ సౌథీని తిరిగి కోల్‌కతా కుటుంబంలోకి స్వాగతించడం చాలా సంతోషంగా ఉంది. ఇదివరకూ ఆటగాడిగా అదరగొట్టిన అతడు ఇకపై కోచ్‌గా సేవలందించనున్నాడు. అంతర్జాతీయంగా సుదీర్ఘ అనుభవం, సాంకేతికంగా గొప్ప పేసర్ అయిన సౌథీ రాకతో మా జట్టు బౌలింగ్ దళం పటిష్టం అవుతుందని నమ్ముతున్నా. తన నాయకత్వ లక్షణాలు, ప్రశాంతమైన ప్రవర్తనతో జట్టులోని కుర్రాళ్లకు అతడు మంచి మెంటర్ అవుతాడు’ అని కోల్‌కతా సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించాడు.
కోల్‌కతా బౌలింగ్ కోచ్‌గా నియమితులవ్వడం పట్ల సౌథీ అనందం వ్యక్తం చేశాడు. ‘కోల్‌కతా నాకు ఎప్పుడూ కుటుంబం లాంటిదే. ఈసారి కొత్త పాత్రలో తిరిగి రావడం గౌరవంగా అనిపిస్తోంది. ఈ ఫ్రాంచైజీకి విశేషమైన సంపదతో పాటు.. అభిమానగణం కూడా ఎక్కువే. ఆటగాళ్లు కూడా మంచి రికార్డు కలిగినవాళ్లే. ఐపీఎల్ 2026లో కోల్‌కతా విజయవంతం అవ్వడంలో నా వంతు పాత్ర పోషిస్తాను’ అని సౌథీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021, 2022, 2023 ఎడిషన్లలో కోల్‌కతా జెర్సీ ధరించిన సౌథీ ఇప్పుడు బౌలింగ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ అయిన ఇతడు మూడు ఫార్మట్లలో కలిపి 700 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 2021లో టెస్టు గదను గెలుపొందిన కివీస్ జట్టులో సభ్యుడు కూడా.
First words from our new bowling coach, Tim Southee 🤩💜 pic.twitter.com/JikC4XchI0
— KolkataKnightRiders (@KKRiders) November 14, 2025