Aus Vs NZ t20 | హోరాహోరీ.. టీ20లో న్యూజిలాండ్‌పై ఆఖరి బంతికి ఆసీస్ విజయం
ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. బుధవారం హోరాహోరీగా సాగిన తొలి టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Aus Vs NZ t20 | వెల్లింగ్టన్: ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. బుధవారం హోరాహోరీగా సాగిన తొలి టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యఛేదనలో చివరి ఓవర్లో విజయానికి ఆసీస్‌కు 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో కెప్టెన్ మిచెల్ మార్ష్ (72 నాటౌట్), టిమ్ డేవిడ్ (31 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.
మొదటి మూడు బంతులు సింగిల్స్‌కే పరిమితమైన ఆసీస్ బ్యాటర్లు..నాలుగో బంతిని డేవిడ్ భారీ సిక్స్‌గా మలిచాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా, చివరి బంతిని డేవిడ్ ఫోర్ కొట్టి జట్టును గెలుపు సంబురాల్లో నింపాడు. సాంట్నర్ (2/42)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత రచిన్ రవీంద్ర (68), కాన్వె (63) అర్ధసెంచరీలతో కివీస్ 215/3 స్కోరు చేసింది. స్టార్క్, కమిన్స్, మార్ష్ ఒక్కో వికెట్ తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

