ముంబై: ఐపీఎల్(IPL 2026)లో ఆర్సీబీ, ముంబై క్రికెటర్లు ఫైన్ పడింది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమాన విధించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అంపైర్ నిర్ణయాన్ని విస్మరించినందుకు ఆ ఫైన్ వేశారు. దీంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలోకి వెళ్లింది. బాల్ ఇవ్వమని అంపైర్లు అడుగుతున్నా.. పట్టించుకోకుండా బంతిని టిమ్ పదేపదే పరీక్షించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 రూల్‌ను టిమ్ డేవిడ్ ఉల్లంఘించినట్లు ఐపీఎల్ పేర్కొన్నది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కూడా ఫైన్ వేశారు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతని ఆ ఫైన్ పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4ను టిమ్ డేవిడ్ ఉల్లంఘించినట్లు ఐపీఎల్ తన ప్రకటనలో చెప్పింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్ల సమయాన్ని ఎక్కువగా తీసుకుందని, దీని ముంబై కెప్టెన్ బాధ్యడు అవుతాడని ఐపీఎల్ పేర్కొన్నది. పాండ్యాకు 12 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో చెప్పింది.
🚨 FINED FOR HARDIK & TIM DAVID 🚨
– Hardik Pandya has been fined ₹12 Lakhs for maintaining a slow over-rate vs RCB.
– Tim David has been fined 25% of his match fees for an incident vs MI.
— Faruk🐦 (@uf2151593) April 13, 2026