IPL 2025 : సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్లు చెలరేగడంతో టాపార్డర్ కుప్పకూలింది. అయితే.. కెప్టెన్ రజత్ పాటిదార్(23) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్(50 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 14వ ఓవర్లో డేవిడ్.. వరుసగా మూడు సిక్సర్లు బాది అర్ధ శతకం సాధించాడు. డేవిడ్ మెరుపులతో కోలుకున్న ఆర్సీబీ దాంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. చిన్నస్వామిలో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న బెంగళూరును అర్ష్‌దీప్ సింగ్(2-23) దెబ్బకొట్టాడు. అతడు తొలి ఓవర్లో బౌండరీ బాదిన అదే ఓవర్లో ఫిలిప్ సాల్ట్(4) వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(23) ధాటిగా ఆడాడు. అర్ష్‌దీప్ మరోసారి ఆర్సీబీకి షాకిస్తూ.. విరాట్ కోహ్లీ(1)ని పెవిలియన్ పంపాడు. కోహ్లీ లాంగాన్‌లో కొట్టిన బంతిని యాన్సెన్ పరుగెడుతూ వెళ్లి అందుకున్నాడు. ఈ సీజన్లో పెద్దగా రాణించని లివింగ్‌స్టోన్(4) ఒక బౌండరీతో టచ్‌లో ఉన్నట్టే కనిపించాడు. కానీ, బార్ట్లెట్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జితేశ్ శర్మ(2) పెద్ద షాట్ ఆడబోయి నేహల్‌కు దొరికాడు అంతే.. 32 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్లు వచ్చినట్టే పెవిలియన్ చేరారు.
Innings Break!
Dominant bowling show from #PBKS restrict #RCB to 95/9 👊
Chase on the other side ⌛️
Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/FTqo5FErfy
— IndianPremierLeague (@IPL) April 18, 2025
ఓవైపు వికెట్లు పడుతున్నా టిమ్ డేవిడ్(50 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. అయితే.. హర్‌ప్రీత్ బ్రార్(2-25) వేసిన 12వ ఓవర్లో వరుస బంతుల్లో భువనేశ్వర్ కుమార్(8), యశ్ దయాల్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. కానీ, హేజిల్‌వుడ్ వికెట్ కాపాడుకున్నాడు. 14వ ఓవర్లో రెచ్చిపోయిన డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లతో జట్టు స్కోర్ 90 దాటించాడు. ఆఖరి బంతికి రెండు రన్స్ తీసి అర్థ శతకం సాధించి ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.