Tilak Varma : తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) అరంగ్రేటం మ్యాచ్‌లో అదరగొట్టి శభాష్ అనిపించుకున్నాడు. వెస్టిండీస్(West Indies)పై తొలి టీ20లో ఈ లెఫ్ట్ హ్యాండర్ 39 పరుగులతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. మ్యాచ్‌కు ముందు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) నుంచి డెబ్యూట్ క్యాప్ అందుకున్నాడు. అప్పుడు ద్రవిడ్ సార్ తనతో సహజసిద్దమైన ఆట ఆడే క్రమంలో ఔటైనా పర్లేదని, ఏం ఆందోళన చెందకు అని చెప్పాడని తిలక్ వర్మ తెలిపాడు. ఇషాన్ కిషన్(Ishan Kishan)తో తన అరంగేట్రం అనుభవాలు పంచుకున్న తిలక్ ఏం చెప్పాడంటే..?
‘మ్యాచ్‌లో నీ సహజసిద్ధమైన ఆట ఆడు. వంద శాతం ఇవ్వు. అలా ఆడే క్రమంలో వికెట్ కోల్పోయినా బాధపడకు అని ద్రవిడ్ సార్ అన్నాడు’ అని తిలక్ వర్మ వెల్లడించాడు. అతను, ఇషాన్ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పెట్టింది.
Emotions after maiden call-up 🤗
Giving 💯 percent with the bat 💪
Favourite song 🤔We caught up with #TeamIndia Debutant @TilakV9 before the start of the #WIvIND T20I series 👌👌
WATCH his full conversation with @ishankishan51 🎥🔽 – By @ameyatilak https://t.co/vqZG1Kabwx pic.twitter.com/5a405KR3kP
— BCCI (@BCCI) August 6, 2023
ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఆడిన తిలక్ వర్మ దంచి కొట్టాడు. 11 మ్యాచుల్లో 343 పరుగులు సాధించాడు. దాంతో, మిడిలార్డర్లో ధనాధన్ ఆడగల సత్తా ఉన్న అతడు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. పైగా ఎడమ చేతివాటం బ్యాటర్ కావడం తిలక్‌కు కలిసొచ్చింది. వెస్టిండీస్ పర్యటనతో అతను టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనూ తిలక్ వర్మ 39 పరుగులతో రాణించాడు.
తిలక్ వర్మ(39)
అయితే.. స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్(21), సంజూ శాంసన్(12) విఫలం అయ్యారు. ఆఖరి ఓవర్లో 10 పరుగులకు కేవలం 6 రన్స్ చేసిన టీమిండియా నాలుగు పరుగులతో ఓడిపోయింది. భారత్ , వెస్టిండీస్‌ల మధ్య ఈరోజు రాత్రి 8 గంటలకు రెండో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో సెంచరీ బాదిన యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.