చెన్నై: రానున్న దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టుకు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ హనుమ విహారి సారథ్యం వహించనున్నాడు. విహారి కెప్టెన్సీ వహిస్తున్న సౌత్‌జోన్ టీమ్‌లో హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్‌వర్మ చోటు దక్కించుకున్నాడు.
ఇటీవల ఐపీఎల్లో వర్మ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు మయాంక్ అగర్వాల్, శ్రీకర్ భరత్ సౌత్‌జోన్‌కు ఆడనున్నారు.