తిలక్ పోరాడినా.. పాక్ చేతిలో భారత్-ఏ ఓటమి
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత్-ఏకు షాక్ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-ఏ చేతిలో తిలక్ వర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఓడి నిరాశపరిచింది. ఆదివారం జరిగిన గ్రూప్-బీ పోరులో పాక్ 48 పరుగుల తేడాతో భారత్‌పై నెగ్గింది.
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత్-ఏకు షాక్ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-ఏ చేతిలో తిలక్ వర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఓడి నిరాశపరిచింది. ఆదివారం జరిగిన గ్రూప్-బీ పోరులో పాక్ 48 పరుగుల తేడాతో భారత్‌పై నెగ్గింది. పాక్ ఇచ్చిన 314 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 49.1 ఓవర్లలో 265 రన్స్‌కే ఆలౌటైంది.కెప్టెన్ తిలక్ వర్మ (100) సెంచరీకి తోడు ఓపెనర్ (42 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70), షాబాజ్ అహ్మద్ (49 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 56) మెరుపు అర్ధ శతకాలు చేసినా జట్టుకు ఓటమి తప్పలేదు.
ఓపెనర్ సూర్యవంశీ (11), బదోనీ (0), కుశాగ్ర (2), రింకూ సింగ్ (6), సూర్యాంశ్ (3) నిరాశపరిచారు. హసన్ నవాజ్, అలీ రెజా చెరో మూడు వికెట్లతో దెబ్బకొట్టారు. తొలుత పాక్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌట్ అయింది. హసన్ నవాజ్ (79), మాజ్ సదాఖత్ (59), ఫర్హాన్ యూసఫ్ (56) అర్థ శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్, సూర్యాంశ్, విప్రజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళు పలుమార్లు భారత ప్లేయర్లతో వాదనకు దిగారు. పాక్ బ్యాటింగ్ చేస్తుండగా హర్షిత్ రాణాతో షామిల్ హుస్సేన్ గొడవ పెట్టుకున్నాడు. భారత యువ ఓపెనర్ సూర్యవంశీ ఔటై మైదానం వీడుతున్న సమయంలో పాక్ ఫీల్డర్లు అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఛేజింగ్‌లో హర్షిత్ ఔటైన తర్వాత కూడా పాక్ ఆటగాళ్లు నోటికి పని చెప్పగా.. భారత కెప్టెన్ తిలక్, అంపైర్లు వారిని వారించారు. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో భారత్ పోటీ పడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

