హైదరాబాద్, ఆట ప్రతినిధి: సాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా జరిగిన తెలంగాణ షూటింగ్ చాంపియన్షిప్లో తురగ శ్రీజిత్కృష్ణ మూడు స్వర్ణ పతకాలతో మెరిశాడు.
జూనియర్ మెన్ 10 మీటర్ల రైఫిల్ విభాగంలో 391/400 స్కోరుతో కృష్ణ పసిడి దక్కించుకోగా, అదే జోరు కనబరుస్తూ యూత్ మెన్, సబ్యూత్ మెన్ విభాగాల్లోనూ స్వర్ణాలు సాధించి ఔరా అనిపించాడు.