లియాండర్ పేస్, మహేష్ భూపతి.. ఇండియన్ టెన్నిస్‌లోనే కాదు ప్రపంచంలోని టాప్ డబుల్స్ జోడీలో ఒకటి. ఈ ఇద్దరూ కలిసి మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవగా.. మరో మూడింట్లో రన్నరప్‌గా నిలిచారు. అలాంటి జోడీ విభేదాల కారణంగా విడిపోయింది. అయితే ఇప్పుడీ ఇద్దరిపై జీ5 ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. నితేష్ తివారీ, అశ్విని అయ్యర్ తివారీ దీనికి దర్శకులుగా ఉన్నారు. బ్రేక్ పాయింట్ పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది.
ఈ డాక్యుమెంటరీ కోసం పేస్, భూపతిని విడివిడిగా ఇంటర్వ్యూ చేయడంతోపాటు వీళ్ల జోడీపై సానియా ప్రశంసలు కురిపించడం కూడా ఇందులో చూడొచ్చు. అక్టోబర్ 1 నుంచి ఏడు పార్ట్‌ల సిరీస్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ట్రైలర్లోనే తమ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయన్నది పేస్, భూపతి చెప్పడం చూడొచ్చు. ఓ మగాడిలా ఉండు అని పేస్ గురించి భూపతి అనడం.. భూపతి కోచ్ మాటలు విని అతని గురించి తాను నిర్ణయాలు ఎలా తీసుకున్నానో పేస్ చెప్పడం ఈ ట్రైలర్లో కనిపిస్తుంది.
Would I do it all over again? No.#Breakpoint, the untold story of Mahesh Bhupathi & I. Premieres 1st October on #ZEE5#BromanceToBreakup pic.twitter.com/6jxzRfxG20
— Leander Paes OLY (@Leander) September 17, 2021