న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్‌కు(IPL 2025 Auction) చెందిన ఆటగాళ్ల వేలం ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన వేలం ఈవెంట్లో 577 ఆటగాళ్లను షార్ట్ లిస్టు చేశారు. కానీ చాలా మంది మేటి క్రికెటర్లను.. ఏ ఫ్రాంచైజీ కూడా కొనలేదు. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు ఆ జాబితాలో ఉన్నారు. వేలంలో అమ్ముడుపోని బ్యాటర్లలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఉన్నారు. ఈ టాప్ బ్యాటర్లు గతంలో ఓసారి తమ ఫ్రాంచైజీలకు విజయాలను అందించారు. కానీ ఈసారి మాత్రం ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు.
అమ్ముడుపోని బ్యాటర్ల జాబితాలో వార్నర్, అన్మోల్ప్రీత్ సింగ్, యశ్ దుల్, కేన్ విలియమ్సన్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, మాధవ్ కౌశిక్, పుక్రాజ్ మాన్, ఫిన్ అలెన్, డీవాల్డ్ బ్రెవిస్, బెన్ డకెట్, బ్రాండన్ కింగ్, పాథుమ్ నిస్సంక, స్టీవ్ స్మిత్, సచిన్ దాస్, సల్మాన్ నజర్, లూయిస్ డూ ప్లోయ్, శివాలిక్ శర్మ ఉన్నారు.
ఇక బౌలర్ల జాబితాలో అనేక మంది ఉన్నారు. ఐపీఎల్ టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన పీయూష్ చావ్లాను కూడా ఏ జట్టూ కొనలేదు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, కార్తిక్ త్యాగి, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఉన్నారు. వకార్ సలామ్కేలీ, విజయకాంత్ వియాస్కాంత్, అకీల్ హుసేన్, అదిల్ రషీద్, కేశవ్ మహారాజ్, సకీబ్ హుస్సేన్, విద్వాత్ కావేరప్ప, రాజన్ కుమార్, ప్రశాంత్ సోలంకి, జాతవేద్ సుబ్రమణియన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, రిషాద్ హుస్సేన్, రాఘవ గోయల్, యశ్వంత్, రిచర్డ్ గ్లీసన్, అల్జరీ జోసెఫ్, లూక్ వుడ్, అర్పిత్ గులేరియా, జేసన్ బెహరెండాఫ్, శివం మావి, నవదీప్ సైనీ, దివేశ్ శర్మన్, దిల్షాన్ మధుశంక, ఆడమ్ మిల్నీ, రూర్కీ, లాన్స్ మోరిస్, ఓలీ స్టోన్, కైల్ జేమీసన్, క్రిస్ జోర్డన్ ఉన్నారు.
చాలా మంది ఆల్రౌండర్లకు కూడా మొండిచెయ్యి చూపించారు. టీ20 క్రికెట్లో ప్రస్తుతం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడంతో.. ఆల్‌రౌండర్ పాత్ర తగ్గినట్లు తెలుస్తోంది. శార్దూల్ థాకూర్‌ను ఏ జట్టు కూడా కొనలేదు. ఉత్కర్ష్ సింగ్, డారిల్ మిచెల్, రిషి ధావన్, శివం సింగ్, అట్కిన్సన్, సికందర్ రాజా, కైల్ మేయర్స్, మాథ్యూ షార్ట్, మైకేల్ బ్రేస్‌వెల్, అబ్దుల్ బాసిత్, ప్రిటోరియస్, రోస్టన్ చేజ్, నాతన్ స్మిత్, సంజయ్ యాదవ్, ఉమంగ్ కుమార్, దిగ్విజయ్ దేశ్ముక్ ఉన్నారు.
మేటి వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోను ఈసారి ఏ జట్టు ఖరీదు చేయలేదు. వేలంలో అనేక మంది వికెట్ కీపర్లు కూడా మిస్సయ్యారు. ఉపేంద్రయాదవ్, శాయ్ హోప్, కేఎస్ భరత్, అలెక్స్ కేరీ, అరావలీ, హర్విక్ దేశాయ్, జోష్ ఫిలిప్, చేతన్, తేజస్వి దహియా ఆ లిస్టులో ఉన్నారు. అయితే అమ్ముడుపోని ఆటగాళ్లకు చివరకు ఓ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టోర్నీ సమయంలో ఎవరైనా గాయపడ్డా లేక తప్పుకున్నా.. వారి స్థానంలో ఈ క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉంటుంది.
రిషబ్ పంత్ అత్యధికంగా 27 కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. అతన్ని లక్నో జట్టు సొంతం చేసుకున్నది.