టోక్యో: వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu). ఆమె బ్రాంజ్ మెడల్ గెలిచినప్పటి నుంచీ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆమె చారిత్రక విజయంపై స్పందించారు. అసలు మానసిక బలానికే కనుక గోల్డ్ మెడల్ ఉండి ఉంటే ఆమె పోడియం టాప్‌లో ఉండేది. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఓటమి నుంచి ఒక రోజులోనే కోలుకొని ఇలా గెలవడానికి ఎంత పట్టుదల, అంకితభావం కావాలి అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ.. ఆమె మహీంద్రా థార్‌కు అర్హురాలు అని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌పై కూడా ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఇప్పటికే ఆమె గ్యారేజీలో థార్ కారు ఉందంటూ ఓ ఫొటోను ట్వీట్ చేయడం విశేషం. ఆ ఫొటోలో సింధుతోపాటు అప్పడు మెడల్ గెలిచిన రెజ్లర్ సాక్షి మాలిక్ థార్ కారులోనే వెళ్లడం చూడొచ్చు.
she deserves Thar for her performance. #TharforPVsindhu
— Mr. Wadewale (@shubhwadewale) August 1, 2021
She already has one in her garage… https://t.co/Be6g9gIcYh pic.twitter.com/XUtIPBRrmi
— anand mahindra (@anandmahindra) August 1, 2021