World Cup Stars : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్(ODI World Cup)లో మహిళా క్రికెటర్లు శతకాలతో రెచ్చిపోతున్నారు. ఉపఖండ పిచ్‌లపై తేలిపోతారనుకుంటే.. దూకుడే మంత్రగా చెలరేగుతూ కొండంత స్కోర్ అందిస్తున్నారు. ప్రత్యర్ది నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సైతం తమ వీరబాదుడుతో మంచులా కరిగిస్తున్నారు. తమదైన పవర్ హిట్టింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నారు అలీసా హీలీ, నాట్ సీవర్ బ్రంట్, సోఫీ డెవినె, అషే గార్డ్నర్ వంటి బిగ్‌మ్యాచ్ ప్లేయర్లు. ఈ ఐదుగురి మెరుపులతో ప్రపంచ కప్ వీక్షకులు ఉత్కంఠ పోరాటాలను చూసి తరించిపోతురు.
వరల్డ్ కప్ అనగానే చెలరేగిపోయే క్రికెటర్లు కొందరుంటారు. మహిళా బ్యాటర్లు విషయానికొస్తే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అషే గార్డ్నర్ (Ashleigh Gardner) కూడా అలాంటి ప్లేయరే. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో గార్డ్నర్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 128కే ఐదు వికెట్లు పడిన జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్న ఈ ఆల్‌రౌండర్ పెద్ద షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికించింది. కేవలం 83 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 115 రన్స్ చేసి ఆసీస్‌కు 326 పరుగుల భారీ స్కోర్ అందించింది గార్డ్నర్.
Ash Gardner to the rescue!✨
Her 115 (83) saw 🇦🇺Australia recover from 128/5 to 326 against 🇳🇿New Zealand at Indore #ICCWomensWorldCup2025 #AUSWvsNZW pic.twitter.com/u0v3rxvane
— Cricbuzz (@cricbuzz) October 1, 2025
అనంతరం ఛేదనలో కంగారూ బౌలర్లను కంగారుపెడుతూ న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవినే (Sophie Devine) సైతం (112) శతకంతో రెచ్చిపోయింది. అయితే.. గెలుపు దిశగా సాగుతున్న వైట్ఫెర్న్స్ను స్పిన్నర్ మొలినెక్స్(3-25), పేసర్ సథర్లాండ్(3-26) లు వికెట్ల వేటతో దెబ్బకొట్టారు. డెవినే తర్వాత వచ్చినవాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడా కివీస్ 237కే ఆలౌటయ్యింది. దాంతో, 89 పరుగుల తేడాతో జయభేరి మోగించిన ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌లో పాయింట్ల ఖాతా తెరిచింది.
Devine Display of Determination!
Sophie Devine brings up her century with a SIX!
Another century in the match .#WomenWorldCup #AUSvNZ pic.twitter.com/as7CbBPIjk— AsliBCCIWomen (@AsliBCCIWomen) October 1, 2025
పదమూడో సీజన్ మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ ఎవరిదంటే.. దక్షిణాఫ్రికా బ్యాటర్ తంజిమ్ బ్రిట్స్(Tanzim Brits)ది. రికార్డ్ బ్రేకింగ్ శతకంతో సఫారీలను ఒంటిచేత్తో గెలిపించిందీ హిట్టర్. ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విఫలమైన బ్రిట్స్ న్యూజిలాండ్‌పై మాత్రం అపర కాళికల రెచ్చిపోయింది. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన బ్రిట్స్ కివీస్ బౌలర్లను ఊతికేస్తూ బౌండరీలతో విరుచుకుపడింది. 87 బంతుల్లోనే సెంచరీ సాధించింది.
– Won Gold Medal in 2007 World Youth Championship in Javelin throw.
– Won Bronze Medal in 2010 World Championship in Javelin throw.
– Now Part of South Africa team.
– 4 Hundreds in last 5 ODI innings.THE JAVELIN CELEBRATIONS FROM TAZMIN BRITS..!!!! 🫡🙌pic.twitter.com/ljCuMcAdi4
— Tanuj (@ImTanujSingh) October 7, 2025
వన్డేల్లో ఆమెకిది ఏడో శతకం. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన బ్రిస్త్ 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఏడో సెంచరీ బాదింది. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం మేగ్ లానింగ్ (Meg Lanning) రికార్డును బ్రేక్ చేసింది డాషింగ్ బ్యాటర్. లానింగ్ 44 ఇన్నింగ్స్‌ల్లో ఏడో శతకం నమోదు చేసింది. అంతేకాదు ఒక క్యాలండర్లో అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొట్టింది బ్రిస్త్. హల్లిడే వేసిన 31వ ఓవర్లో సింగిల్ తీసి ఈ ఏడాది ఐదో శతకం తన ఖాతాలో వేసుకుందీ సఫారీ చిచ్చరపిడుగు. అనంతరం బాణం వదిలినట్టు ఫోజు పెట్టి సెలబ్రేట్ చేసుకున్న తను భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డును బ్రేక్ చేసింది. నాలుగు శతకాలతో మంధాన రెండో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా రెండు సంవత్సరాలు (2024, 2025) టీమిండియా స్టార్ నాలుగు సెంచరీలో రికార్డు సృష్టించింది.
Unprecedented! What a year Tazmin Brits is having 🔥 #CWC25 pic.twitter.com/KhLYN3Zz0Q
— ESPNcricinfo (@ESPNcricinfo) October 6, 2025
SLW vs ENGW : సూపర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver Brunt) వరల్డ్ కప్‌లో జోరు చూపిస్తోంది. బంగ్లాదేశ్‌పైనా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ఆమె శనివారం కొలంబోలో శ్రీలంకపై సెంచరీ(117)తో గర్జించింది.టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సాయంతో జట్టుకు కొండంత స్కోర్ అందించింది. ప్రేమదాస మైదానంలో శ్రీలంక స్పిన్నర్ రణవీర విజృంబణకు 168కే ఆరు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని బ్రంట్.. బౌండరీల మోతతో స్కోర్‌బోర్డును ఉరికించింది. సుగంధ కుమారి వేసిన 49వ ఓవర్లో సిక్సర్‌తో శతకం సాధించింది బ్రంట్. మూడంకెల స్కోర్ సాధించిన తర్వాత బ్రంట్ బ్యాట్‌ను ఊయల మాదిరిగా ఊపుతూ సెలబ్రేట్ చేసింది.
What a way to bring up a #CWC25 ton, Nat Sciver-Brunt 🙌
Watch #ENGvSL LIVE in your region, broadcast details here ➡️ https://t.co/7wsR28PFHI pic.twitter.com/3cj5BkDLnV
— ICC (@ICC) October 11, 2025
ఎందుకంటే.. తల్లిగా ఆమెకు ఇదే తొలి ప్రపంచకప్ సెంచరీ. అవును.. ఈ ఏడాది మార్చిలో బ్రంట్ భాగస్వామి(వైఫ్) క్యాథరీన్ బ్రంట్ మగబిడ్డకు జన్మనిచ్చింది. రెసీప్రోకల్ ఐవీఎఫ్ విధానంలో ఈ జంట పేరంట్స్ అయ్యింది. అందుకే.. తన శతకాన్ని తమ ముద్దుల తనయుడు థియోకు అంకితమిచ్చింది. వంద తర్వాత కూడా జోరు తగ్గించిన ఆమె ప్రబోధిని వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో స్కోర్ 250 దాటించింది. అయితే.. ఐదో బంతికి పెద్ద షాట్ ఆడి బౌండరీ వద్ద చిక్కింది. దాంతో, ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.
విశాఖపట్టణం వేదికగా భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఆస్ట్రేలియా గెలిచిందంటే కారణం కెప్టెన్ అలీసా హేలీ(Alyssa Healy). వరల్డ్ కప్ వంటి బిగ్ టోర్నీల్లో చెలరేగిపోయే తను టీమిండియాకు షాకిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడింది. అంతేకాదు ఈ మెగా టోర్నీలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 331 పరుగుల ఛేదనలో ఆదినుంచి దూకుడుగా ఆడిన హీలీ ఓపెనర్ ఫొబె లిచ్‌ఫీల్డ్ (40)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. పవర్ ప్లే తర్వాత గేర్ మార్చిన ఆసీస్ నాయకురాలు లెగ్ సైడ్ బౌండరీలతో చెలరేగింది. అషే గార్డ్నర్(45)తో మరో విలువైన ఇన్నింగ్స్ ఆడిన హీలీ వరల్డ్ కప్‌లో చరిత్రలో మూడో సెంచరీ నమోదు చేసింది.
◾ Her first ODI hundred since 2022
◾ Her second ODI hundred against India
◾ Her third ODI World Cup hundredAlyssa Healy 🤝 Big match player pic.twitter.com/yeV6nPnoOR
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025
శతకం తర్వాత జోరు పెంచిన ఆమె స్నేహ్ రానా ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌తో అవసరమైన నెట్ రన్‌రేట్‌ను ఆరుకు తగ్గించింది. హీలీని ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మెరుపు ఇన్నింగ్స్‌తో కంగారూ టీమ్‌ను గెలుపువాకిట నిలిపిన హీలీ చివరకు 142 పరుగుల వద్ద శ్రీ చరణి ఓవర్లో వెనుదిరిగింది. స్నేహ్ రానా డైవ్ చూస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. కానీ, ఆ తర్వాత వరుసగా వికెట్లు తీసిన టీమిండియా రేసులోకి వచ్చినా.. గార్డ్నర్, అలీసా పెర్రీ (47 నాటౌట్) జట్టుకు వన్డేల్లో భారీ విజయాన్ని కట్టబెట్టారు.