CWC 2023: ఈ నలుగురు వరల్డ్ కప్ విజయసారథులకు ఒక స్పెషల్ కనెక్షన్.. అదేంటంటే..!
CWC 2023: ఈ విజయం ద్వారా కమిన్స్ కూడా దిగ్గజ సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్‌ల సరసన చేరాడు. ఈ నలుగురికీ ఒక విషయంలో స్పెషల్ కనెక్షన్ ఉంది.
CWC 2023: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించడం ద్వారా ఆసీస్ సారథి పాట్ కమిన్స్ తన దేశానికి ఆరో ఐసీసీ ట్రోఫీని అందించాడు. కమిన్స్ ఇంతకుముందు ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందించడమే గాక తాజాగా వన్డే వరల్డ్ కప్ కూడా అందుకున్నాడు. ఈ విజయం ద్వారా కమిన్స్ కూడా దిగ్గజ సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్‌ల సరసన చేరాడు. ఈ నలుగురికీ ఒక విషయంలో స్పెషల్ కనెక్షన్ ఉంది. ఈ నలుగురూ వరల్డ్ కప్ గెలవడానికి ముందు ఏడాది పెళ్లి చేసుకోవడం విశేషం.
ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్.. 2002 జూన్ 22న రియాన్నా కాంటర్ను పెళ్లి చేసుకున్నాడు. 2003లో ఆసీస్.. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి కప్ గెలుచుకుంది.
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని.. 2010లో జులై 04న సాక్షిని వివాహమాడాడు. 2011లో భారత్.. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో గెలిచి రెండోసారి కప్ కొట్టింది.
Australia won the 1987 WC.
Australia won the 1999 WC.
Australia won the 2003 WC.
Australia won the 2007 WC.
Australia won the 2015 WC.
Australia won the 2023 WC.They won World Cup in 5 different decades….!!!!! pic.twitter.com/E9AB7EEcd0
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
ఇక ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ 2018 నవంబర్ 03న పెళ్లి తారా మోర్గాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ 2019లో తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.
తాజాగా ఆసీస్ సారథి పాట్ కమిన్స్ కూడా ఇదే కోవలోకి వచ్చాడు. కమిన్స్ గతేడాది ఆగస్టు 01న తన చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ బెక్సీ బాస్టన్తో వివాహబంధంతో ఒక్కటయ్యాడు. 2023లో అతడు ఏకంగా రెండు ఐసీసీ ట్రోఫీలు దక్కించుకోవడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

