హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో యూత్ ఓపెన్ రెగెట్టా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం బలమైన ఈదురు గాలుల కారణంగా అప్టిమిస్టిక్ గ్రీన్ విభాగంలో రేసులను వాయిదా వేయాల్సి వచ్చింది. అప్టిమిస్టిక్ మెయిన్ ఫ్లీట్‌లో ఎన్వైఎస్సీకి చెందిన రిజ్వాన్ అగ్రస్థానంలో నిలువగా, బాలికల కేటగిరీలో శ్రింగారి రాయ్ టాప్‌లో నిలిచింది.
ఐఎల్సీఏ 4 క్లాస్ బాలుర విభాగంలో రమాకాంత్, తులసి సత్తాచాటారు. 420మిక్స్డ్ క్లాస్‌లో టీఎస్ఏ క్లబ్‌కు చెందిన తనూజ కామేశ్వర్, శ్రవణ్ అగ్రస్థానంలో నిలువగా, 29ఈఆర్ క్లాస్‌లో అజయ్, సత్యమ్ అద్భుత ప్రదర్శన్తో ఆకట్టుకున్నారు.