లక్నో: భారత్ ‘ఏ’, ఆస్ట్రేలియా ‘ఏ’ మధ్య అనధికారిక తొలి టెస్టు మ్యాచ్ ఎలాంటి ఫలితం లేకుండానే డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ ‘ఏ’ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్(27 నాటౌట్), క్యాంప్‌బెల్(24 నాటౌట్) నిలకడగా రాణించారు. యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ(5-3-4-0) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 403/4తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన యువ భారత్ 531/7 వద్ద డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్(281 బంతుల్లో 150, 14ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఆసీస్ యువ బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరిస్తూ ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఏడో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ధృవ్ జురెల్(140)తో కలిసి ఐదో వికెట్‌కు 228 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోరె రిచోలీ(3/159) మూడు వికెట్లు తీశాడు.