హైదరాబాద్, ఆట ప్రతినిధి: మలేషియాలో జరిగిన ఆసియా పారా తైక్వాండో చాంపియన్షిప్ జీ4 ఈవెంట్లో తెలంగాణ పారా తైక్వాండ్ జట్టు సత్తా చాటింది. రెండు రజతాలు, ఒక కాంస్యంతో మన క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టించారు.
పీ51 కేటగిరీలో గౌతమ్ యాదవ్ రజతం గెలువగా పీ52లో శివ కూడా సిల్వర్ గెలుచుకున్నాడు. పీ 52 కేటగిరీ మహిళల విభాగంలో కృష్ణవేణి కాంస్యం నెగ్గింది.