ముంబై: ఎఫ్ఐఎమ్ ఆసియా రోడ్ రేసింగ్ చాంపియన్‌షిప్ కోసం రంగం సిద్ధమైంది. థాయ్‌లాండ్ వేదికగా ఈనెల 27వ వరకు జరుగనున్న రేసింగ్ కోసం హోండా ప్రకటించిన జట్టులో భారత్ నుంచి జోహాన్ రీవ్స్, కెవిన్ కింటాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆసియాలోనే అత్యంత పోటీ ఉండే రేసింగ్ సర్యూట్లలో ఒకటైన థాయ్‌లాండ్ రేసింగ్‌లో జోహాన్, కెవిన్..అంతర్జాతీయ రేసర్లతో పోటీపడనున్నారు.
2025 ఎఫ్ఐఎమ్ ఆసియా రోడ్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో మొత్తం ఆరు రౌండ్లు జరుగనున్నాయి. థాయ్‌లాండ్‌లోని చాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో తొలి రౌండ్ మొదలుకానుంది. కెవిన్ ఇప్పటికే ఏఆర్ఆర్‌సీ సీజన్లలో అనుభవం పొందిన రైడర్ కాగా, జోహాన్ మాత్రం తొలిసారి అంతర్జాతీయ టోర్నీలో పోటీపడుతున్నాడు.