హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర స్థాయి రగ్బీ ఆటల పోటీల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) గురుకుల విద్యార్థులు స్వర్ణ పతకంతో మెరిశారు. ఈ నెల 11 నుంచి 13 వరకు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఐదో జూనియర్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించగా, ఎంజేపీ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకం కైవసం చేసుకున్నారు.
పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు శ్రీకాంత్, చందు, ఆకాశ్, మధు, శివ, లింగస్వామి, హరికృష్ణ, విష్ణు, జైవిందర్ను ఎంజేపీ సొసైటీ సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రటరీ తిరుపతి అభినందించారు. ఈ జుట్టు నుంచి నలుగురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావటంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు.