హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోవా వేదికగా జరిగే 37వ జాతీయ క్రీడల కోసం ఆదివారం రాష్ట్ర నెట్‌బాల్ సెలెక్షన్స్ జరుగనున్నాయి. మహబూబ్‌నగర్‌లోని డీఎస్ఏ గ్రౌండ్స్‌లో పురుషుల, మహిళల ఆటతీరును పరిశీలించి జట్లను ఎంపిక చేయనున్నారు.
నేషనల్ గేమ్స్‌కు రాష్ట్ర నెట్‌బాల్ జట్లు అర్హత సాధించిన నేపథ్యంలో ఎంపిక నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఖాజాఖాన్ పేర్కొన్నాడు.