మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 10: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న టోర్నీలో అంతరజిల్లాల నుంచి మొత్తం 26 జట్లు పోటీలో ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జట్లు తొలిరోజు శుభారంభం చేశాయి.
బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు 09-01 తేడాతో వికారాబాద్‌పై, నాగర్‌కర్నూల్ 06-03 కామారెడ్డిపై, నాగర్‌కర్నూల్ 07-01 నారాయణపేటపై విజయం సాధించాయి. బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు 16-01 తేడాతో పెద్దపల్లిపై, గద్వాల 10-08 తేడాతో వనపర్తిపై గెలిచాయి. ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, విక్రమాదిత్యారెడ్డి ప్రారంభించారు.