హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగిరం చేసింది. క్యాబినెట్ సబ్‌కమిటీకి అధ్యక్షత వహిస్తున్న క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రముఖ క్రీడా కోచ్‌లు గోపీచంద్, గగన్ నారంగ్, నాగపురి రమేశ్, ఒలింపియన్లు, రాష్ట్ర ఒలింపిక్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు నిర్మిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాభివృద్ధి కోసం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారి, కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.