న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 6న డబ్ల్యూఎఫ్ఐ నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని రిటర్నింగ్ అధికారి మహేశ్మిట్టల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ)నియమించిన రిటర్నింగ్ అధికారి మహేశ్ నేతృత్వంలో జరుగనున్న ఎన్నికల్లో నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 19గా నిర్ణయించారు.
ప్రతీ రాష్ట్ర సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులు పాల్గొనే అవకాశమున్నా ఎన్నికల్లో ఒకరికి మాత్రమే ఓటు వేసే చాన్స్ ఉంది. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా మొత్తం 50 ఓట్లు పోల్ కానున్నాయి. మెజార్టీని బట్టి పోలింగ్ జరిగిన జూలై 6వ తేదీనే విజేతను ప్రకటించనున్నారు.