హైదరాబాద్ : శ్రీనిధి యూనివర్సిటీ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ రసవత్తరంగా జరుగుతోంది. నరసింహరాజు, మురళీ యాదవ్ నాలుగో విజయంతో ఎంవైకే స్ట్రయికర్స్కు 8 పాయింట్లు అందించారు. ఆర్య వారియర్స్ కూడా ఏడు పాయంట్లతో టీమ్ టీ ఆఫ్, సెలబ్రిటీ స్టింగర్స్, ఆటమ్ చార్జర్స్తో కలిసి రెండో స్థానానికి చేరింది. రన్ అఫే లీడర్లు ఏకంగా 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అక్టోబర్ 14న మూడో రౌండ్, అక్టోబర్ 18వ తేదీన నాలుగో రౌండ్ జరుగనున్నాయి.