మల్కాజిగిరి: నేపాల్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ టోర్నీలో తెలంగాణ రన్నరప్‌గా నిలిచింది. పోక్రాలో మంగళవారం ఆతిథ్య నేపాల్‌తో జరిగిన ఫైనల్లో తెలంగాణ 0-1 తేడాతో ఓటమిపాలై రెండో స్థానానికి పరిమితమైంది. హోరాహోరీగా సాగిన తుది పోరులో మన జట్టు నేపాల్‌కు దీటైన పోటీనిచ్చినా టైటిల్ దక్కించుకోవడంలో విఫలమైంది. అంతకుముందు పటిష్ఠ సిక్కింతో జరిగిన సెమీస్‌లో తెలంగాణ 1-0తో గెలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.