Home
Sports
The Pakistan Cricket Board Alongside The Teams Dismal Performance During The England Tour Have Once Again Sparked A Controversy
పాక్ క్రికెట్లో మళ్లీ సంక్షోభం!.. సెలక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా
ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి రచ్చకెక్కాయి. మూడో టెస్టుకు ముందు ఉన్నట్టుండి ఏకంగా ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్పై వేటు వేయడమే గాక జట్టులోని ఏడుగురు సభ్యులను టీమ్ నుంచి విడుదల చేయడం వివాదాస్పదమైంది.
కరాచీ: ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి రచ్చకెక్కాయి. మూడో టెస్టుకు ముందు ఉన్నట్టుండి ఏకంగా ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్పై వేటు వేయడమే గాక జట్టులోని ఏడుగురు సభ్యులను టీమ్ నుంచి విడుదల చేయడం వివాదాస్పదమైంది. తనకు సమాచారం లేకుండానే పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నదనే కారణంతో మనస్తాపానికి గురైన మాజీ సారథి మిస్బా ఉల్ హక్.. నేషనల్ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకున్నాడు.
తన రాజీనామాను అతడు బోర్డుకు అందజేయగా కోచ్, ఆటగాళ్లను తప్పించడంపై దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. ‘అసలు ఈ నిర్ణయం వెనుకున్న లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఐదు టెస్టులకే కోచ్పై ఎందుకు వేటు వేసినట్టు?’ అని ప్రశ్నించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

