India-A | మాకే (క్వీన్స్లాండ్): ఆస్ట్రేలియా పర్యటనలో భారత యువ జట్టు అనధికారిక తొలి టెస్టులో ఓటమి దిశగా సాగుతోంది. ఆట రెండోరోజు పూర్తి ఆధిపత్యం సాధించిన కుర్రాళ్లు మూడో రోజు బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. సాయి సుదర్శన్ (103) సెంచరీతో మెరవగా దేవ్‌దత్ పడిక్కల్ (88) తృటితో శతకాన్ని కోల్పోయాడు.
కానీ మిడిలార్డర్ వైఫల్యంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 312 పరుగులకు ఆలౌటై ఆసీస్ ఎదుట 225 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఏ’.. 50.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి మరో 86 పరుగులు కావాల్సి ఉంది.