ఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఒసియానియా గ్రూప్-1లో భారత జట్టు రెండో విజయాన్ని నమోదుచేసింది. ఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన పోరులో భారత్.. 3-0తో మంగోలియాను ఓడించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట సింగిల్స్‌లో జీల్ దేశాయ్.. 6-0, 6-0తో అను-జిన్-గాంటర్ను ఓడించి శుభారంభం చేసింది.
అనంతరం రెండో సింగిల్స్‌లో సహజ.. 6-0, 6-0తో జర్గల్ అల్టన్సరనైను చిత్తుచేసి ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. డబుల్స్ విభాగంలో వైష్ణవి అడ్కర్, రుతుజా భోస్లే జోడీ 6-1, 6-0తో ఖొన్గొర్జుల్, అల్టన్సరనైను ఓడించింది. మూడు మ్యాచ్‌లలోనూ భారత్ ఒకే ఒక గేమ్ కోల్పోవడం గమనార్హం. శనివారం భారత్.. కొరియాతో మ్యాచ్‌లోనూ నెగ్గితేనే ప్లేఆఫ్స్ ఆశలు నిలుస్తాయి.