జకార్తా: హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్-4 స్టేజ్‌లో శనివారం జపాన్‌తో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశ తొలి రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన భారత్.. ఆఖరి పోరులో ఇండోనేషియాపై ఘన విజయంతో నాకౌట్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లతో నిండి ఉన్న భారత జట్టు.. లీగ్ దశలో జపాన్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తున్నది.
సూపర్-4లో జపాన్, దక్షిణ కొరియా, మలేషియాతో భారత్ ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరనున్నాయి. సీనియర్ల గైర్హాజరీలో భారత ఆటగాళ్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో విఫలమవుతున్నారు. ఈ సమస్యను అధిగమించి సమిష్టిగా సత్తాచాటితేనే జపాన్‌పై విజయం సాధించే అవకాశాలున్నాయి.