హైదరాబాద్: ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్(ఐఎస్ఆర్ఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీ తరహా లీగ్‌గా మొదలైన ఐఎస్ఆర్ఎల్ ఈసారి కొత్త హంగులతో అభిమానుల ముందుకు రాబోతున్నది. ఈనెల 24 నుంచి రైడర్ల రిజిస్ట్రేషన్ మొదలవుతుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ లీగ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
వరల్డ్ చాంపియన్న జోర్డి టిక్సర్తో పాటు మ్యాట్ మాస్, థామస్ రెమెటె లాంటి స్టార్ రేసర్లు లీగ్ బరిలో దిగనున్నారు.