ఖైరతాబాద్, జనవరి 1: అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ మోటర్ సైక్లిస్ట్ (ఏఎఫ్ఎం) చాంపియన్ షిప్ పోటీల్లో భారతీయ రేసర్ ప్రతిభ చాటాడు. డిసెంబర్ 31 వరకు అమెరికాలో జరిగిన బటన్ విల్లో వే పార్క్, థండర్ వీల్ రేస్‌లలో తిరుపతికి చెందిన ఎం. సాయిదీప్ అగ్రస్థానంలో నిలిచాడు. కష్టతరమైన ఈ రేసులో విజేతగా నిలువడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
అమెరికాలో జరిగిన పోటీల్లో సత్తాచాటడం భారతీయుడిగా.. అందులోనూ తెలుగువాడిగా ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే భారత రేసర్లకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సాయిదీప్ తెలిపాడు.