దోహ: ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్స్‌లో భారత గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, దొమ్మరాజు గుకేశ్ రెండో రోజు కాస్త వెనుకబడ్డారు. గురువారం మొదలైన ఈ టోర్నీలో తొలి రోజు ఐదు రౌండ్లు ముగిసే సరికి గుకేశ్, అర్జున్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగినా శుక్రవారం జరిగిన నాలుగు రౌండ్లలో ఈ ఇద్దరూ టాప్-5 నుంచి కింద పడిపోయారు.
గుకేశ్.. 6, 7వ రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకోగా 8వ గేమ్‌ను గెలిచాడు. కానీ 9వ రౌండ్లో మళ్లీ ఓడాడు. 9 రౌండ్ల తర్వాత గుకేశ్.. 6.5 పాయింట్లతో సంయుక్తంగా ఏడో స్థానంలో నిలిచాడు. రష్యా ఆటగాడు వ్లాదిస్లావ్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదే టోర్నీలో 15 ఏండ్ల గౌతమ్ కృష్ణ ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లకు షాకిచ్చాడు. ర్యాపి డ్ చెస్‌లో గౌతమ్.. అలగ్జాండర్ (సెర్బియా), అరవింద్ చిదంబరం (భారత్), తైమోర్ రజబోవ్ (అజెర్బైజాన్)ను ఓడించాడు. ఆ తర్వాత రెండు గేమ్‌లను డ్రా చేసుకున్నాడు.