హైదరాబాద్, ఆట ప్రతినిధి: గిరిధారి సింగ్ స్మారక హార్స్ పోలో కప్‌లో ‘ఆరియాన్ అచీవర్స్’ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ పోటీల ఫైనల్లో అచీవర్స్ 6-5తో జింధల్ పాంథర్స్‌పై విజయం సాధించింది.
విశాల్ సింగ్, అభిమన్యు, డానియల్, హౌర్ అలీతో కూడిన ఆరియాన్ అచీవర్స్ జట్టు అంతకుముందు సెమీఫైనల్లో డెల్టా ఫౌండేషన్ పోలో జట్టుపై 7-5తో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో విజేతగా నిలిచిన అచీవర్స్ ప్లేయర్లను జట్టు యజమానులు పారుల్ రాయ్, విక్రమ్ రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు.