బెంగళూరు: దులీప్ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజు స్పిన్నర్ల హవాతో సెంట్రల్ జోన్ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు స్పిన్ మాంత్రికులు సరాన్ష్ జైన్ (5/49), కుమార్ కార్తికేయ (4/53) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 149 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న పిచ్‌పై జైన్, కార్తికేయ స్పిన్ మాయకు సౌత్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
తన్మయ్ (31) టాప్ స్కోరర్ కాగా మిగిలినవారంతా విఫలమయ్యారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ వికెట్లేమీ నష్టపోకుండా 50 రన్స్ చేసింది. డానిష్ (28*), అక్షయ్ (20*) క్రీజులో ఉన్నారు.