Imane Khelif | అల్జీరియా: ఇమానె ఖెలిఫ్…అల్జీరియా వివాదాస్పద బాక్సర్. ఇటీవలి పారిస్ ఒలింపిక్స్‌లో తనపై వచ్చిన విమర్శలకు పసిడి పతకంతో పంచ్‌లు కురిపించింది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ తన దేశానికి స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ క్రమంలో ఖెలిఫ్లోని కొత్త కోణం బయటకు వచ్చింది.
బాక్సింగ్ రింగ్‌లో దూకుడుగా పంచ్‌లు విసరడమే కాదు.. అందం విషయంలో తనను మించిన వారు లేరని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఖెలిఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఫ్లోరల్ డిజైన్‌లో మెరిసిపోతున్న ఖెలిఫ్ నవ్వులు చిందిస్తున్నది.
43 మందితో బరిలో అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: లిమా వేదికగా ఈనెల 27 నుంచి 31 వరకు జరుగనున్న అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 43 మందితో కూడిన జట్టుతో భారత్ బరిలోకి దిగనుంది. గత ఎడిషన్‌లో భారత్ 25వ ర్యాంక్‌లో నిలిచింది.