ENG vs AUS | లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ ఐదో టెస్టులోనూ బజ్‌బాల్ ఆటతీరును కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో దంచికొట్టింది. మాజీ కెప్టెన్ జో రూట్ (91; 11 ఫోర్లు, ఒక సిక్సర్), జానీ బెయిర్ స్టో (78; 11 ఫోర్లు) అర్ధశతకాలకు తోడు డకెట్ (42), కెప్టెన్ స్టోక్స్ (42) రాణించడంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లిష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4, మార్ఫి 3 వికెట్లు పడగొట్టారు. 12 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు.. ప్రస్తుతం 377 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్టువర్ట్ బ్రాడ్ (2), అండర్సన్ (8) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం పక్కా కాగా.. ఇంగ్లిష్ జట్టు.. కంగారూల ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి!