బ్రిస్బేన్: ఆస్ట్రేలియా మహిళల ఫుట్బాల్ జట్టు అద్భుతం చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
శనివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో ఆసీస్ 7-6 తేడాతో ఫ్రాన్స్పై అద్భుత విజయం సాధించింది. విజేతను నిర్ణయించేందుకు అనివార్యమైన పెనాల్టీ షూటౌట్లో ఆసీస్ గెలిచింది.