బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక ఆస్టేలియా ఓపెన్‌కు ముందు సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్ ఫైనల్ ఇంటర్నేషనల్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంక వరుసగా రెండో ఏడాది టైటిల్ గెలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో ఈ బెలారస్ అమ్మాయి.. 6-4, 6-3తో మార్టా కొస్ట్యుక్ (ఉక్రెయిన్)ను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది.
పురుషుల విభాగంలో డేనిల్ మెద్వెదెవ్.. 6-2, 7-6 (7/1)తో బ్రాండన్ నకషిమ (అమెరికా)ను ఓడించి విజేతగా నిలిచాడు.