హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ 17వ మినీ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. నిజాం కాలేజీ మైదానం వేదికగా మొదలైన టోర్నీలో మొత్తం 22 రాష్ర్టాల నుంచి అండర్-12 బాలబాలికల జట్లు బరిలో ఉన్నాయి. తెలంగాణ, అసోం మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేచింది. ఈ పోరులో అసోంపై తెలంగాణ విజయం సాధించింది. ర్నీ ప్రారంభానికి రాష్ట్ర మంత్రులు శ్రీహరి, ప్రభాకర్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ‘ప్లేయర్లు విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయి. రాష్ట్రంలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రంగారెడ్డి, పవన్‌కుమార్ పాల్గొన్నారు.