డబ్లిన్: అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న తెలంగాణ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ.. వన్డేల్లోనూ అదే జోరు కొనసాగిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ పర్యటన ద్వారా టీ20 అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. ఈ నెల 30 నుంచి జరగనున్న ఆసియాకప్ కోసం భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తిలక్ మాట్లాడుతూ.. ‘వన్డే క్రికెట్లో బాగా ఆడగలననే నమ్మకంతో ఉన్నా. హైదరాబాద్ తరఫున లిస్ట్-‘ఎ’ క్రికెట్‌తో పాటు అండర్-19 స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబర్చా. వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియాకప్‌నకు ఎంపికవుతాని కలలో కూడా ఊహించలేదు’ అని అన్నాడు.